'కాళేశ్వరం పనులు సకాలంలో పూర్తిచేయాలి' | Sakshi
Sakshi News home page

'కాళేశ్వరం పనులు సకాలంలో పూర్తిచేయాలి'

Published Fri, Dec 8 2017 4:14 PM

KCR to inspect projects work in Karimnagar  - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పంప్‌ హౌజ్‌ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా కేసీఆర్‌ పరిశీలించారు.

మంత్రి హరీష్‌రావు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరకు పంపాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు పనులు సకాలంలో జరిగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

రేపు సమీక్ష సమావేశం
కాగా  రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని కేసీఆర్‌ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. 

Advertisement
Advertisement